ETV Bharat / bharat

ఎన్డీఏ కూటమిలో చేరనున్న హిందుస్థానీ​ అవామ్ మోర్చా!

author img

By

Published : Aug 30, 2020, 1:13 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో.. హిందుస్థానీ అవామ్​ మోర్చా(హామ్​) పార్టీ జట్టుకట్టనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఆ పార్టీ వ్యవస్థాపకుడు, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జీతన్​ రామ్​ మాంఝీ ఇవాళ చేయనున్నారని తెలుస్తోంది.

Bihar polls: Manjhi-led HAM expected to join NDA
ఎన్డీఏ కూటమిలో చేరనున్న హిందుస్థానీ​ అవామ్ మోర్చా!

ఎన్డీఏ కూటమిలో మరో పార్టీ చేరనుంది. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్​ మాంఝీ సారథ్యంలోని హిందుస్థానీ అవామ్​ మోర్చా-సెక్యులర్​(హామ్​​) ఈ కూటమిలో చేరనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మాంఝీ ఇవాళ(ఆగస్టు 30న) వెలువరిస్తారని పేర్కొన్నాయి.

ఆగస్టు 20న మహాకూటమి నుంచి వైదొలొగింది హామ్​. అనంతరం ఈ పార్టీ.. అధికార జేడీయూ​లో విలీనం అవుతుందని ప్రచారం జరిగింది. సీఎం నితీశ్​ కుమార్​ను మాంఝీ గురువారం కలవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

మహాకూటమి, ఎన్​డీఏకు ప్రత్యామ్నాయంగా జేఏపీ, వీఐపీ వంటి స్థానిక పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని మాంఝీ తొలుత భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టతరమని భావించి తన ఆలోచన విరమించుకున్నారట.

బిహార్​లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్డీఏ కూటమిలో చేరితే తమ పార్టీకి 9 నుంచి 12 స్థానాలు దక్కుతాయని 'హామ్'​ నమ్మకంతో ఉంది.

మరోవైపు మాంఝీ రాకతో దళిత ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని భాజపా-జేడీయూ కూటమి భావిస్తోంది. ఆ వర్గానికే చెందిన రామ్​ విలాస్ పాసవాన్​ కూడా ఎన్డీఏలో ఉండటం తమకు మరింత కలసివస్తుందని అనుకుంటున్నాయి.

బిహార్​లో మొత్తం 7 కోట్ల 21లక్షల 40వేలకు పైగా ఓటర్లున్నారు. ఇందులో 15 శాతం ఓట్లు దళితులు, మహాదళితుల వర్గానికి చెందినవే. మొత్తం ఓట్లలో.. ముస్లింలు 17 శాతం, ఓబీసీ 50 శాతం, అగ్రవర్ణాలు 19 శాతం, ఇతరులు 2 శాతం ఉన్నారు.

ఎన్డీఏ కూటమిలో భాజపా, జేడీయూ, ఎల్​జేపీ ముఖ్య పార్టీలుగా ఉన్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ ఎన్నికల కోసం భాజపా 'కమల్ కనెక్ట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.