ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..? - bihar election date phase wise

బిహార్​ ఎన్నికల నగారా మోగింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల బలబలాలు ఏంటి..? రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ.. ఈసారైనా అధికారం చేజిక్కించుకుంటుందా..? కాంగ్రెస్​ పరిస్థితి ఎలా ఉంది? సీట్ల సర్దుబాటుపై అధికార జేడీయూ మిత్రపక్షం ఎల్​జేపీ మధ్య పొత్తు లేనట్లేనా..? ప్రత్యర్థుల్ని నితీశ్​ సేన ఎలా ఎదుర్కొంటోంది? ఓసారి చూద్దాం.

Bihar polls: JDU-BJP fully ready for Bihar polls, not in alliance with LJP
బిహార్​ ఎన్నికల ఫైట్​: ఎవరి సత్తా ఎంత..?
author img

By

Published : Sep 25, 2020, 8:59 PM IST

బిహార్‌ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అవకాశవాద రాజకీయ కూటములు, కుటుంబ కలహాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపులు.. అందుకే బిహార్‌ గడ్డపై రాజకీయాలకు అడ్డా. వీటన్నింటికి మించి రసకందాయకంగా ఉంటుంది ఎన్నికల నిర్వహణ. బిహార్‌లో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు పూర్తిచేయటం.. నిర్వాచన్‌ సదన్‌ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంటుంది. ఈసారి అంతకుమించిన మరో సవాల్‌.. కొవిడ్‌ మహమ్మారి నుంచి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో ఎన్నికల నగారా మోగింది.

Bihar polls
బిహార్​ ఎన్నికల షెడ్యూల్​

నాడు ఏమైంది?

గత (2015) అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీలు మహాఘట్‌ బంధన్‌ (మహా కూటమి)గా ఏర్పడి బరిలోకి దిగాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 180 వరకు దక్కించుకున్నాయి. అత్యధికంగా ఆర్జేడీ 80 సీట్లు సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్‌ కుమార్‌ రెండేళ్ల తర్వాత మహా కూటమి నుంచి బయటకొచ్చి.. భాజపా మద్దతుతో తిరిగి అధికారం చేపట్టారు. ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా ఆర్జేడీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bihar polls
2015 ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు

జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ

విపక్షాలతో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షం నుంచి ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పథకాలను ప్రచారం చేసుకుంటూ పక్కా వ్యూహం రచించారు. ఎన్నికల నిబంధనావళి​ అమల్లోకి రాకముందే గత రెండు నెలల్లో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే పనులను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమిలోని భాజపా కూడా నితీశ్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. మూడు దఫాలు బిహార్​ సీఎంగా పని చేసిన నితీశ్​నే.. నాలుగోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టనుంది ఎన్డీఏ. మహాకూటమి ఏర్పాటై ఆర్జేడీ 140 స్థానాలకు పైగా పోటీలో దిగితే... ఎన్డీఏకు గట్టి పోటీ తప్పదు.

ఎల్​జేపీ ఒంటరిగానే పోటీ.?

బిహార్​ ఎన్డీఏలో అసమ్మతి పెరగడం, సీట్ల కేటాయింపుల్లో పొత్తు కుదరకపోవడం సహా నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం).. జేడీయూతో పొత్తు పెట్టుకోవడం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి నచ్చడం లేదు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది.

బిహార్​ సీఎం నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పోటీ చేసే 143 స్థానాల్లో.. తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎల్​జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్​సభ​ ఎన్నికల్లో 6 సీట్లలో పోటీ చేసిన ఎల్​జేపీ.. అన్ని సీట్లలోనూ గెలిచింది.

జేడీయూ నుంచి వేరుపడి హెచ్‌ఏఎంను స్థాపించిన జీతన్‌ రాం మాంఝీ మొన్నటి వరకు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమిలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ వైఖరి గిట్టక ఆ కూటమికి 'రాం రాం' చెప్పారు. ఈ ఎన్నికల ముంగిట జేడీయూతో పొత్తు పెట్టకున్నారు మాంఝీ. మగధ ప్రాంతంలో 15-20 నుంచి సీట్లు ఆ పార్టీ ఆశిస్తోంది. జేడీయూ మాత్రం 10-12 సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన హెచ్‌ఏంఎకు వచ్చింది ఒక్కసీటే కావడం గమనార్హం.

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 40 సీట్లు ఎస్సీ రిజర్వ్​డ్. రాష్టంలో దళితుల ఓట్లు 16శాతం. అంటే రిజర్వ్​డ్​ స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల కూడా వారు కీలకంగా మారనున్నారు. వీటిని పొందేందుకు జీతన్‌ రాం మాంఝీ, పాసవాన్​ మధ్య గట్టిపోటీ ఉండనుంది.

మహాకూటమికి సవాళ్లు..

అత్యధిక స్థానాలను సాధించినా ప్రతిపక్షంలోనే ఉన్న రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) అనేక సవాళ్ల మధ్య బరిలోకి దిగుతోంది. లాలూప్రసాద్‌ యాదవ్‌కు జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆ పార్టీకి ఇప్పుడు బలమైన కూటమిని ఏర్పాటు చేయడం పెద్ద సవాలే. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ రాజకీయాలతో చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆర్జేడీ ఒకవేళ స్వతంత్రంగా పోటీ చేసినా నెగ్గుకురావడం సులభం కాదు.

ఎన్డీఏలో లేని పార్టీలన్నీ ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి కింద పోటీకి సిద్ధమవుతున్నట్లు వాతావరణం కనిపిస్తున్నా.. వాటి ఆశలు, ఆకాంక్షలు ఆర్జేడీకి ఎంతగా దోహదపడతాయన్నది వేచి చూడాలి. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు ఈ మహా కూటమిలో చేరొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్​ పరిస్థితి..

కాంగ్రెస్​ పార్టీ.. బిహార్​లోనూ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది! ఒకప్పుడు బిహార్​లో 196 సీట్లు గెలిచిన కాంగ్రెస్​.. గత ఎన్నికల్లో 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్​ పుంజుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావట్లేదు. కాంగ్రెస్ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలంటే 2015లో పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో తలపడాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాంగ్రెస్‌తో పాటు.. ప్రస్తుత అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేని సీపీఐ, సీపీఎంలు; 3 స్థానాలున్న సీపీఐ(ఎం-ఎల్‌); చిన్న పార్టీలైన వికాస్‌షీల్‌ ఇన్సాన్‌, ఆర్‌ఎల్‌ఎస్పీలు కూడా ఈసారి ఎక్కువ స్థానాలను తమకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏను అధికారంలోకి రాకుండా చేయడమే ఆర్జేడీ లక్ష్యమని చెబుతున్న నేపథ్యంలో.. ఈ పార్టీలన్నీ తమకు కనీసం 100 స్థానాలు కేటాయించాలని.. ఆర్జేడీకి 140 స్థానాలను వదిలేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

2015 ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీచేసి 80 గెలుచుకున్న ఆర్జేడీ ఆ కోరికలను నెరవేరస్తుందా అనేది చూడాలి. ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావాలంటే 122 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా ఆర్జేడీ ఈ మార్కును చేరాలంటే ఎక్కువ స్థానాల్లోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ఓట్లు చీల్చగలిగే పార్టీలు..

బిహార్​ బరిలో ప్రధాన పక్షాలే కాకుండా.. సమాజ్​వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్​ కాంగ్రెస్​, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా తదితర పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు సన్నద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. ఈసారి దశ మారుతుందన్న ఆశతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో హవా చాటుతున్నా.. బిహార్​లో మాత్రం ఓట్లు చీల్చటం వరకే పరిమితమవుతున్నాయి.

మూడో కూటమి..

ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఏ) కన్వీనర్, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ.. ఆర్జేడీ నాయకత్వంలో మహాకూటమి ఏర్పడగా మూడో కూటమి కోసం యశ్వంత్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. 2018 వరకు భాజపాలో కీలక పదవుల్లో కొనసాగిన యశ్వంత్​.. తర్వాత ఆ పార్టీని వీడారు. 16 చిన్నాచితకా పార్టీలతో కలిపి ఐక్య ప్రజాస్వామ్య కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 243 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కూటమి ఎంతోకొంత భాజపా ఓట్లపై ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.