"పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన రావాలని కోరుకుంటున్నాం. అందుకే వారిని దారిలోని చెత్తను తీసుకురమ్మని కోరతాం. ఆపై రిసైక్లింగ్కు పంపిస్తాం." -ఉపాధ్యాయురాలు
లక్షలు చెల్లించినా ఏడాదికోసారి ఫీజు మొత్తాన్ని పెంచుతూనే ఉంటాయి కొన్ని పాఠశాలలు. కానీ ఈ బడిలో... వచ్చే దారిలో కనిపించే చెత్తను సేకరించి బడిలోని చెత్త డబ్బాను నింపడమే విద్యార్థులు చేయాల్సిన పని. అంతే వారింకేం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా స్కూలు యాజమాన్యమే వారికి ఉచిత దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
ఇంత మంచి ఆలోచన చేసిన ఈ స్కూలును దక్షిణ కొరియాలోని ఓ సంస్థ నిర్వహిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూ, ఉచిత విద్యను అందిస్తున్నందుకు విద్యార్థులకు బడిపై మక్కువ పెరిగిపోతోంది.
"ఈ స్కూల్లో ఫీజు భారం ఉండదు. అందుకే మేమిక్కడ చదవాలనుకుంటున్నాం. కేవలం మేము వచ్చే దారిలో చెత్తను తెచ్చి బడిలోని చెత్త బుట్టలో వేస్తాము" -విద్యార్థిని
మనసుంటే ప్రైవేటు బడిలోనూ ఉచిత విద్య అందిచవచ్చని నిరూపించింది పద్మపాణి పాఠశాల.
ఇదీ చూడండి:రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు