ETV Bharat / bharat

క్వారంటైన్ కేంద్రంలో బాలికపై అత్యాచారం

బిహార్​లోని ఓ క్వారంటైన్​ కేంద్రంలో దారుణం జరిగింది. కరోనా అనుమానితుల క్వారంటైన్​ కేంద్రంలో 15 ఏళ్ల బాలికపై కాపలాదారు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో ఆగకుండా ఆ బాలికను బెదిరిస్తూ వారం రోజులుగా లైంగిక దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

bihar: girl raped in quarantine center
క్వారంటైన్ కేంద్రంలో బాలికపై అత్యాచారం
author img

By

Published : Jul 17, 2020, 7:03 AM IST

కరోనా అనుమానితుల క్వారంటైన్​ కేంద్రంలో 15 ఏళ్ల బాలికపై కాపలాదారు అత్యాచారం చేయడం సహా కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న దారుణ ఘటన బిహార్​లో జరిగింది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆ బాలిక పట్నా శివారులోని ఓ రైల్వేస్టేషన్​లో ఉండగా, పోలీసులు గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. వారు ముందు జాగ్రత్త చర్యగా బాలికను పట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించి కరోనా అనుమానితుల క్వారంటైన్​ కేంద్రంలో ఉంచారు.

అక్కడ కాపలాదారుగా పనిచేస్తున్న 40 ఏళ్ల మహేష్ ఈ నెల 8న స్నానాల గదికి వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ లైంగిక దాడి కొనసాగిస్తున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం ఆ క్వారంటైన్ కేంద్రానికి మరో బాలిక రాగా.. ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని... బాధితురాలు బాలల సంరక్షణ కేంద్రం నిర్వహకులకు ఈ దారుణాన్ని వివరించింది. దీనితో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పిర్​బహొరె స్టేషన్ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ముంబయిలో భవనం కూలిన ఘటనలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.