బిహార్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 38 జిల్లాల్లో మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. తూర్పు చంపారన్, గయా, శివన్, బెగుసరాయ్ జిల్లాలలో మూడేసి చొప్పున.. మిగతా జిల్లాలలో ఒకటి లేదా రెండేసి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మూడంచెల భద్రత
కేంద్ర సాయుధ బలగాలు, బిహార్ మిలిటరీ పోలీస్, జిల్లా పోలీసులతో.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 19 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు మోహరించనున్నాయి. కౌంటింగ్ అనంతరం శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా.. మొత్తం 59 సీఏపీఎఫ్ బృందాలు భద్రతా చర్యలు చేపట్టనున్నాయి.
కరోనా నిబంధనలు తప్పనిసరి
కొవిడ్ దృష్ట్యా అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించేందుకు మాస్కుల నిబంధన తప్పనిసరి చేసిన అధికారులు.. శానిటైజర్లనూ అందుబాటులో ఉంచనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి: