బిహార్‌లో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ బారిన పడి మరణించిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ వ్యాధిపై పోరాడటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన ఆరోగ్యశాఖను, వైద్యులను ఆదేశించారు.
మహమ్మారి బారిన చిన్నారులు..
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ వ్యాధి ప్రబలి సుమారు 77 మంది చిన్నారులు మరణించారు. మెదడువాపు వ్యాధి లక్షణాలతో శ్రీకృష్ణ వైద్యశాలలో 63 మంది, కేజ్రీవాల్ ఆసుపత్రిలో 11 మంది చిన్నారులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గిపోవడం వల్లనే చిన్నారులు చనిపోతున్నారని వైద్యులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, ఇతర కారణాల వల్ల రాత్రిపూట పిల్లలు ఆహారం తీసుకోవడంలేదు. ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోతే పిల్లల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిహార్‌లోని 12 జిల్లాల్లో ఈ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: భారత్‌లో యజ్ఞయాగాలు చేస్తున్న విదేశీయులు