ETV Bharat / bharat

టెట్​ పరీక్ష హాల్​టికెట్​పై​ హీరోయిన్ అనుపమ ఫొటో​! - టెట్​ పరీక్ష హాల్​టికెట్​పై​ హీరోయిన్ అనుపమ ఫొటో​!

తెలుగు, తమిళం​, మలయాళం, కన్నడ సినిమాల్లో వరుస హిట్​లతో దూసుకుపోతోన్న అనుపమ పరమేశ్వరన్​.. ఉపాధ్యాయ​ అర్హతా పరీక్ష-టెట్ రాస్తోందా? ఒకవేళ రాసినా.. ప్రవేశ పత్రం ఆమె పేరుతో​ ఉండాలి కదా..? కానీ, ఓ పురుషుడి పేరుతో ఉన్న హాల్​టికెట్​పై ఆమె ఫొటో ఎందుకుంది?

bihar-board-erroneously-put-the-picture-of-south-actress-on-the-stet-exam-admit-card
టీచర్​ పరీక్షకు అనుపమకు ప్రవేశపత్రం
author img

By

Published : Jan 21, 2020, 2:56 PM IST

Updated : Feb 17, 2020, 9:02 PM IST

టెట్​ పరీక్ష హాల్​టికెట్​పై​ హీరోయిన్ అనుపమ ఫొటో​!

బిహార్​లో స్కూల్​ ఎగ్జామినేషన్​ బోర్డు నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. స్టేట్​ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్​ (ఎస్​టెట్)లో​ ఓ పురుషుడి ప్రవేశ పత్రంలో హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​ ఫొటో ముద్రించడం చర్చనీయాంశమైంది.

పేరు రిషికేశ్.. బొమ్మ అనుపమ

మక్దుంపుర్​కు చెందిన రిషికేశ్​ కుమార్​ ఉపాధ్యాయ అర్హత సంపాదించేందుకు ఎస్​టెట్​ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 28న జరగబోయే పరీక్షకు హాజరయ్యేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు. అయితే పరీక్ష తేదీ దగ్గరపడుతుండగా ఆన్​లైన్​లో అడ్మిట్​ కార్డులు విడుదల చేసింది బిహార్​ బోర్డు. హాల్​టికెట్​ డౌన్​లోడ్​ చేసుకున్న రిషికేశ్ ​ కంగుతిన్నాడు. తన పేరుతో ఉన్న హాల్​టికెట్​పై అనుపమ పరమేశ్వరన్​ ఫొటో చూసి విస్తుపోయాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

ఇదీ చదవండి:వివాహం కోసం 12 కిలోమీటర్లు పరుగెత్తిన పెళ్లికొడుకు!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.