ETV Bharat / bharat

బిహార్​ బరి: 22 మందితో శివసేన ప్రచారదళం - మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే

బిహార్​ ఎన్నికల్లో పోటీ చేసే శివసేన అభ్యర్థుల తరుపున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు మొత్తం 22 మంది పార్టీ నేతలను ప్రచారకర్తలుగా నియమించారు.

Uddhav Thackeray to campaign in Bihar
బిహార్​ ఎన్నికలు: 22 మందితో శివసేన ప్రచారదళం
author img

By

Published : Oct 9, 2020, 7:32 AM IST

మూడు దశల్లో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు 22 మంది నాయకులను ప్రచారకర్తలుగా నియమించారు. ఇప్పటికే 50 మంది అభ్యర్థులను బరిలోకి నిలిపిన ఉద్ధవ్..​ వారికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

ఈ ప్రచార దళంలో మహారాష్ట్ర పర్యటక మంత్రి ఆదిత్య ఠాక్రేతో పాటు సుభాశ్​ దేశాయ్, సంజయ్​రౌత్​, అనిల్​దేశాయ్​, వినాయక్​ రౌత్​, అరవింద్​ సావంత్, ప్రియాంక చతుర్వేది, రాహుల్​ షెవాలే వంటివారు ఉన్నారు. గతేడాది ఎన్​డీఏ కూటమి నుంచి వైదొలిగిన శివసేన విడిగా పోటీ చేస్తోంది.

మొత్తం 243 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలు మూడు దశల్లో వరుసగా అక్టోబర్​ 28, నవంబర్​ 3, 7 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:'తుపాను తీవ్రత అంచనాకు ప్రత్యేక వ్యవస్థ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.