పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహించ తలపెట్టారు. జామా మసీదు వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భీమ్ ఆర్మీ తలపెట్టిన ఈ ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వేలాది మంది ప్రజలు జామా మసీదు వద్దకు తరలివచ్చారు.
జామా మసీదు వద్ద పరిస్థితిని పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.