ETV Bharat / bharat

కరోనాపై పోరు: భిల్వారా నేర్పిన పాఠాలు - కరోనా వైరస్​

ప్రపంచంతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు.. వైరస్​ విస్తరిస్తోంది. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అయితే రాజస్థాన్​లోని భిల్వారా జిల్లా మాత్రం ఇందుకు భిన్నం. గత నెలలో 27 కరోనా పాజిటివ్‌ కేసులతో ఈ జిల్లా రాజస్థాన్‌లో రెండో స్థానంలో, దేశంలో పది కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితిలో జిల్లా యంత్రాంగం చేపట్టిన పటిష్ఠ చర్యలతో మార్చి 30 తర్వాత కేవలం ఒక్క పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదైంది. ఇదేలా సాధ్యపడింది?

BHILWARA IN RAJASTHAN ERADICATED CORONA
కరోనాపై పోరు: భిల్వారా నేర్పిన పాఠాలు
author img

By

Published : Apr 8, 2020, 6:58 AM IST

దేశాన్ని, ప్రపంచాన్ని కసిగా కాటేస్తోంది కరోనా మహమ్మారి. దీని కట్టడికి అంతే పట్టుదలతో చర్యలు చేపట్టి దేశం దృష్టిని ఆకట్టుకుంది రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా. గత నెలలో 27 కరోనా పాజిటివ్‌ కేసులతో ఈ జిల్లా రాజస్థాన్‌లో రెండో స్థానంలో, దేశంలో పది కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితిలో జిల్లా యంత్రాంగం చేపట్టిన పటిష్ఠ చర్యలతో మార్చి 30 తర్వాత కేవలం ఒక్క పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదైంది. దేశంలో ఏ ఇతర ప్రాంతంలోనూ ఇలాంటి తగ్గుదల నమోదు కాలేదు. ఈ విజయవంతమైన కట్టడిని అభినందించిన కేంద్ర ప్రభుత్వం ‘భిల్వారా మోడల్‌’ను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా.. రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీబీ గుప్తాతో నిర్వహించిన వీడియో సమావేశంలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

భిల్వారా జిల్లాలో తొలి కేసు మార్చి 19న నమోదైంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. ఆయన ద్వారా ఆసుపత్రిలో సిబ్బందికి ఈ వైరస్‌ సోకింది. చూస్తుండగానే ఆ సంఖ్య 27కి పెరిగింది. తొలి కేసు నమోదైన తర్వాత రోజు (మార్చి 20) నుంచి ఏప్రిల్‌ 2 వరకూ జిల్లాలో తొలి దశ కర్ఫ్యూ అమలుచేశారు. జిల్లా సరిహద్దుల్ని మూసివేశారు. అన్ని ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిషేధించారు. నిత్యావసరాలు మినహా అన్నింటినీ నిలిపివేశారు.

7 వేల బృందాలతో సేవలు
జిల్లా మొత్తం లాక్‌డౌన్‌, పక్కాగా అనుమానితుల గుర్తింపు- పరీక్షలు, పకడ్బందీగా క్వారంటైన్‌- ఐసోలేషన్‌ వార్డుల నిర్వహణ ద్వారా ఈ జిల్లా యంత్రాంగం దేశానికి మార్గదర్శనం చేసింది. 7 వేల బృందాలతో ఈ విజయం సాధించింది. వీరి ద్వారా 20 లక్షల మంది స్థానికుల్ని అతి తక్కువ సమయంలో సర్వే చేశారు.

కరోనా జోన్‌.. బఫర్‌ జోన్‌
బాధిత వైద్యుడు పనిచేసిన బీబీఎం ప్రైవేటు ఆసుపత్రి చుట్టూ 1 కి.మీ. పరిధిని కరోనా జోన్‌గా, 3 కి.మీ. పరిధిని బఫర్‌ జోన్‌గా ప్రకటించారు. ఇతర కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్ల పరిధిలోనూ ఇలానే జోన్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్‌ మ్యాపింగ్‌ ద్వారా ఇలాంటివి మొత్తం 6 ప్రాంతాలను గుర్తించి.. అక్కడ అనుమానితులకు నిరంతరం స్క్రీనింగ్‌ చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ప్రాంతాలన్నింటిలో, సేవలు అందిస్తున్న అన్ని అంబులెన్స్‌లు, పోలీస్‌ వాహనాలు, స్క్రీనింగ్‌ కేంద్రాలు, క్వారంటైన్‌ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం క్రిమిసంహారకాలతో శుద్ధి చేస్తున్నారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
వ్యక్తుల్లో కొవిడ్‌ లక్షణాలను గుర్తించడం, విదేశాలకు వెళ్లొచ్చిన వారు, కరోనా జోన్లలో ఉన్నవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని గుర్తించడంపై... స్క్రీనింగ్‌, సర్వే బృందాల సిబ్బందికి నిపుణులైన వైద్యులతో శిక్షణ ఇప్పించారు. ప్రతి పది సర్వే బృందాలకు ఒక పర్యవేక్షకుణ్ని నియమించారు. బీబీఎం ఆసుపత్రిలో పనిచేసిన ప్రతి వైద్యుడు, సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన ప్రతి వ్యక్తి, రోగులు.. వీరితో పాటు కరోనా బాధితులను కలిసిన ప్రతి వ్యక్తిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అనుమానితులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 200 పడకల సామర్థ్యం ఉన్న ఎంజీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా పరీక్షలకు కేటాయించారు. తర్వాత దీనిని 427 పడకలకు పెంచారు. అనుమానితులను ప్రభుత్వ వాహనాల్లో ఇక్కడికి తీసుకువచ్చి పరీక్షల అనంతరం మళ్లీ ఇంటి దగ్గర దించుతున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన వారు, లక్షణాలు కనిపించిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రతిరోజూ మూడుసార్లు నమూనాలను పరీక్ష కోసం జయపుర తీసుకెళ్లేవారు. అలానే కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు దగ్గరగా మెలిగిన ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచారు. వారిని కలిసిన (టైర్‌ 2) వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

కరోనా కెప్టెన్లు, ఫైటర్లు
ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి నగరం, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కెప్టెన్లు, ఫైటర్లను నియమించారు. నగరంలో సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్‌; బ్లాక్‌, గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్‌ అభివృద్ధి అధికారి, తహశీల్దార్లను కరోనా కెప్టెన్లుగా నియమించారు. నగరంలో ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తలు; గ్రామాల్లో సర్పంచి, పంచాయతీ సహాయకులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలను కరోనా ఫైటర్లుగా ఏర్పాటుచేశారు. వీరు హోం క్వారంటైన్‌లో ఉన్న వారి అవసరాలు, వలస కూలీల రాకపోకల్ని, ఇతర అవసరాల్ని పర్యవేక్షించేవారు.

ఇంటింటికీ కూరగాయలు, పాలు సరఫరా

భిల్వారా నగరంలో ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకూ రెండో దశ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిత్యావసరాలకు అనుమతులనూ నిషేధించారు. ఇంటింటికీ ప్రభుత్వమే కూరగాయలు, పండ్లు, పాలు సరఫరా చేస్తోంది. పేదలకు ఆహార పొట్లాలు అందజేస్తోంది.

హోటల్‌ గదులూ క్వారంటైన్లే

22 ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 11,659 బెడ్లు, 27 హోటళ్లలోని 1541 గదులను క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగించారు. 25 బెడ్ల చొప్పున సామర్థ్యం ఉన్న మరో నాలుగు ప్రైవేటు ఆసుపత్రులను కరోనా సేవలకు ఆధీనంలోకి తీసుకున్నారు.

స్థానిక యంత్రాంగానికి స్వేచ్ఛ

ఒక్కో ప్రాంతంలో పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. వాటికి అనుగుణంగా కరోనాపై పోరు విధానాన్ని కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. టోంక్‌ జిల్లాలో ఇదే విధానాన్ని అమలు చేసి, మంచి ఫలితాలు సాధించాం. స్థానిక యంత్రాంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, పనిచేయడానికి స్వేచ్ఛనివ్వాలి. ఇదే ఇక్కడ నేను నేర్చుకున్న అంశం.

- రోహిత్‌కుమార్‌ సింగ్‌, వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, రాజస్థాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.