ETV Bharat / bharat

కొవిడ్-19పై పోరులో భారత్ కృషి కీలకం: బిల్​ గేట్స్

కరోనాపై పోరులో భారత్​ చేస్తోన్న కృషి కీలకమైందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహవ్యవస్థాపకులు బిల్​గేట్స్ అన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు బిల్​ గేట్స్.

Bill Gates_Bharat
కొవిడ్-19పై పోరులో భారత్ కృషి కీలకం: బిల్​ గేట్స్
author img

By

Published : Oct 20, 2020, 7:00 AM IST

భారత్​లో జరుగుతున్న పరిశోధనలు, భారీ స్థాయిలో టీకా తయారీ ప్రయత్నాలు కొవిడ్-19 నివారణలో ఎంతో కీలకమైనవని మైక్రోసాఫ్ట్ సంస్థ సహవ్యవస్థాపకులు, భూరి విరాళాల దాత బిల్​ గేట్స్ అన్నారు. సోమవారం గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీకా తయారీ, కరోనా సోకినట్లు నిర్ధారించే ప్రక్రియలు క్లిష్టమైనవని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొవిడ్​కు టీకా చేసే యత్నాల్లో నిమగ్నమయ్యారని, ఈ పెనుసవాల్​ను ఎదుర్కోవడానికి వారంతా పరస్పరం సహకరించుకుంటున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఔషధ కంపెనీలు కూడా ఒకదానికొకటి చేయూతను అందించుకుంటున్నాయని అన్నారు. మరింత సులభంగా కరోనాను నిర్ధారించే కిట్​లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:చైనా ఆధిపత్యానికి దీటుగా 'మలబార్'​ విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.