భారత స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల 88వ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని లాహోర్ కేంద్రంగా ఉన్న భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ నిర్వహించింది.
ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ముగ్గురు యోధుల త్యాగాలను, పోరాట పటిమను గుర్తుచేసుకున్నారు అక్కడి అభిమానులు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
ఇటీవల న్యూజిలాండ్ మారణహోమంలో మృతి చెందిన వారి ఆత్మ శాంతికి మౌనం పాటించారు.
ఆంగ్లేయులపై తిరుగుబాటు కారణంగా 1931 మార్చి 23న భగత్ సింగ్‌ను ఉరి తీసింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. అప్పుడు ఆయన వయస్సు 23 ఏళ్లు.
భగత్ సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను కూడా అదే రోజు ఉరితీసింది. అప్పట్లో ఈ ఘటన వేలాది మందిని ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించింది.