ETV Bharat / bharat

బంగాల్​లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట - బంగాల్ నేర వార్తలు

బంగాల్​ దక్షిణ దినాజ్​పుర్​ జిల్లాలో బాలిక హత్య, కాల్చివేతపై విద్యార్థులు నిరసన బాట పట్టారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. భాజపా ఎంపీ సుకాంత వారికి మద్దతిచ్చారు.

బంగాల్​లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట
SCHOOL GIRL MURDER
author img

By

Published : Jan 7, 2020, 7:39 PM IST

Updated : Jan 7, 2020, 10:57 PM IST

బంగాల్​లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట

బంగాల్​లోని దక్షిణ దినాజ్​పుర్​ జిల్లా కుమార్​గంజ్​లో కాలిపోయిన బాలిక మృతదేహం కలకలం రేపింది. శవానికి సమీపంలో వీధి కుక్కలు ఘర్షణ పడుతుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహంపై కత్తిపోట్లు, రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు. బాలిక మృతదేహాన్ని రాత్రివేళ కుక్కలు పీక్కు తిని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మహబూబ్​ అలీ అనే వ్యక్తి నిందితుడని తేలింది. అలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విద్యార్థుల ఆగ్రహం

బాలిక హత్యపై ఆగ్రహించిన విద్యార్థులు, స్థానికులు 512 నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దోషులను శిక్షించాలని డిమాండ్​ చేస్తూ వేలాది మంది నిరసన చేపట్టారు. ఫలితంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఎంపీ మద్దతు..

విషయం తెలుసుకున్న భాజపా ఎంపీ సుకాంత మజుందర్​ అక్కడి చేరుకుని నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేశారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో నిందితుడికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

Kolkata, Jan 06 (ANI): A clash broke out between Jadavpur University students and police personnel during the protest against JNU violence on January 06. The clash took place near Sulekha Mor in Kolkata. Several students across the nation came in support of JNU students. On Sunday evening, more than 18 students of the university, including JNUSU president Aishe Ghosh, were injured and were taken to the AIIMS Trauma Centre after a masked mob entered the JNU campus and attacked them and professors.
Last Updated : Jan 7, 2020, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.