శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్విందర్ సింగ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. తొలుత నిరాకరించిన కుటుంబ సభ్యులు.. ఆయనను హత్య చేసిన వారిని పట్టుకుంటామని అధికారుల హామీ ఇవ్వగా.. నిర్వహించేందుకు ఒప్పుకున్నారు.
అసలు ఏమైందంటే..
పంజాబ్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్ సింగ్(62)ను.. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం హత్య చేశారు. ఈ నేపథ్యంలో బల్విందర్ను హత్య చేసిన వారిని అరెస్టు చేసే వరకు.. భౌతిక కాయానికి అత్యక్రియలు నిర్వహించేది లేదని.. ఆయన భార్య జగదీశ్ కౌర్ సందూ, కుటంబ సభ్యులు శనివారం స్పష్టం చేశారు.
ఈ హత్య నేపథ్యంలో తమ కుటుంబానికి రక్షణ కలిపించాలని కూడా బల్విందర్ భార్య డిమాండ్ చేశారు. తమకు పంజాబ్ రాష్ట్రం రక్షణ కల్పించలేకపోతే.. ఆ బాధ్యతను కేంద్రం తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వారి కుటుంబ సభ్యులకు.. నిందితులు పట్టుకుంటామి హామీ ఇచ్చారు. దీనితో బల్విందర్ సింగ్ అంత్యక్రియలకు ఒప్పుకున్నారు కుటుంబ సభ్యులు.