ETV Bharat / bharat

బాబ్రీ కేసులో ఈనెల 24న అడ్వాణీ వాంగ్మూలం - ఉమా భారతి

భాజపా అగ్రనేతలు ఎల్​.కె.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని బాబ్రీ మసీదు కేసులో విచారించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమైంది. జులై 23న జోషి, జులై 24న అడ్వాణీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించింది.

Babri mosque demolition case: Advani to depose on July 24; MM Joshi on July 23
బాబ్రీ మసీదు కేసులో ఎల్​.కె.అడ్వాణీ, జోషి విచారణ
author img

By

Published : Jul 20, 2020, 5:37 PM IST

బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్​.కె.అడ్వాణీ వాంగ్మూలాన్ని జులై 24న నమోదు చేయాలని లఖ్​నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద అడ్వాణీ స్టేట్​మెంట్​ను... వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రికార్డు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

జోషి, ప్రధాన్​ను కూడా

bjp leader murali manohar joshi
మురళీ మనోహర్ జోషి

బాబ్రీ కేసులో అడ్వాణీతో పాటు నిందితులుగా ఉన్న భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్​ జోషి వాంగ్మూలాన్ని జులై 23న నమోదు చేయనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ ఎస్​.కె.యాదవ్ తెలిపారు. శివనేన మాజీ ఎంపీ సతీష్ ప్రధాన్​ను జులై 22న వీడియో లింక్ ద్వారా ప్రశ్నించనున్నట్లు స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు... సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసు విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆగస్టు 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది.

ఇదీ చూడండి: ఆయన ఓ పనికిరాని వ్యక్తి: అశోక్ గహ్లోత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.