ETV Bharat / bharat

అయోధ్యలో 2వేల అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​

author img

By

Published : Jul 27, 2020, 3:55 PM IST

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే చోట 2వేల అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​ను ఉంచనున్నట్లు తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. భవిష్యత్తులో మందిరంపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా చరిత్ర, వాస్తవాలను టైమ్​ క్యాప్యుల్​లో భద్రపరచునన్నట్లు పేర్కొంది.

Ayodhya: Time capsule to be placed under Ram temple site
రామాలయ భూభాగంలో 2వేల అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​

అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఆగస్టు 5న భూమిపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. మందిరం నిర్మించే చోట 2,000 అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​ను భద్రపరచనున్నట్లు వెల్లడించింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. రామమందిరానికి సంబంధించిన చరిత్ర, వాస్తవాల పూర్తి వివరాలను ఇందులో పొందుపరచనున్నట్లు పేర్కొంది. దీని ద్వారా భవిష్యత్తులో మందిరానికి సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయని ట్రస్టు సభ్యుడు కామేశ్వర్​ చౌపాల్ తెలిపారు.

గతేడాది నవంబర్​లో అయోధ్య భూవివాదం కేసులో చారిత్రక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అనంతరం దాదాపు 9నెలల తర్వాత రామమందిర నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఎర్పాట్లను ముమ్మరం చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు పంపింది.

ఇదీ చూడండి: ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.