ETV Bharat / bharat

వెంటిలేటర్లు, మాస్కుల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి

కరోనాపై పోరు కోసం తమ వద్ద ఉన్న పరికరాలతో వెంటిలేటర్లను తయారు చేయాలని వివిధ ఆటోమొబైల్​ సంస్థలను కేంద్రం కోరింది. అదే సమయంలో ఫేస్​ మాస్కుల ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది. వచ్చే వారం నుంచి డీఆర్​డీఓ 20వేల ఫేస్​ మాస్కులను రూపొందిస్తుందని స్పష్టం చేసింది.

Automobile manufacturers asked to make ventilators: Health ministry
వెంటిలేటర్లు, మాస్కుల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి
author img

By

Published : Mar 30, 2020, 3:52 PM IST

కరోనా వైరస్​పై​ పోరును కేంద్రం మరింత ముమ్మరం చేస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. వెంటిలేటర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆటోమొబైల్​ సంస్థలను సాయం కోరింది. తమ వద్ద ఉన్న వసతులతో వెంటిలేటర్లను తయారు చేయాలని కోరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఉన్న 14వేల వెంటిలేటర్లను.. కేవలం కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసమే వినియోగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

భారత్​ ఎలక్ట్రానిక్​ లిమిటెడ్​(భెల్​) ఇప్పటికే వెంటిలేటర్ల తయారీ ప్రారంభించింది. స్థానిక ఉత్పత్తిదారులతో కలిసి.. రానున్న రెండు నెలల్లో 30వేల వెంటిలేటర్లను రూపొందించనున్నట్టు కేంద్రం పేర్కొంది.

ఎన్​-95 మాస్కులు...

20వేల ఎన్​-95 మాస్కులను వచ్చే వారం నుంచి డీఆర్​డీఓ ఉత్పత్తి చేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే 11.95 లక్షల ఎన్​-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

దేశం లాక్​డౌన్​లో ఉన్న తరుణంలో ఎక్కడా వైద్య పరికారలు, నిత్యావసరాల కొరత ఏర్పడకుండా పౌర విమానయాన శాఖ జాగ్రత్తలు చేపట్టింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు, సరఫరా ఏజేన్సీలతో కలిసి కార్గో ఫైట్లను నడిపేందుకు కృషిచేస్తున్నట్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నిత్యావసరాలను సరఫరా చేయడానికి ఎయిర్​ ఇండియా, అనుసంధాన ఫ్లైట్లను వినియోగిస్తున్నట్టు పేర్కొంది.

వారి కుటుంబసభ్యుల కోసం...

జవాన్ల కుటుంబ సభ్యుల కోసం సీఆర్​పీఎఫ్​ ఓ హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వైరస్​ నేపథ్యంలో క్విక్​ రియాక్షన్​ టీమ్స్​(క్యూఆర్​టీ)ను కూడా ఏర్పాటు చేసింది.

"ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ అనేక మంది జవాన్లు తమ ఇళ్లకు దూరంగా ఉంటున్నారు. వారందరి కుటుంబసభ్యులను చూసుకునే బాధ్యత ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకునేందుకు అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉంటేనే.. జవాన్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పనిచేస్తారు."

-- సీఆర్​పీఎఫ్​.

ఇదీ చూడండి:- కరోనా డ్యూటీలో చేరేందుకు 20 గంటలు నడుస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.