పాటిదార్ల నాయకుడు, కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడికి దిగాడు. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని బల్దానా గ్రామంలో ఓ సభలో హార్దిక్ ప్రసంగిస్తుండగా చెంప మీద కొట్టాడు. సురేంద్రనగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి సోమా పటేల్ దాడి జరిగినప్పడు ఆ వేదికపైనే ఉన్నారు.
ఊహించని సంఘటనతో సభలో గందరగోళం తలెత్తింది. వెంటనే హార్దిక్ ప్రతిఘటించారు. ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు దుండగుడిని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. హార్దిక్ పటేల్ సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.