ETV Bharat / bharat

విషమంగానే తరుణ్ గొగొయి ఆరోగ్యం

అసోం మాజీ సీఎం తరుణ్​ గొగొయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మెరుగైన ఆరోగ్యం కోసం డయాలసిస్​ చేసినా.. పరిస్థితుల్లో ఏ మార్పూ కనిపించలేదని రాష్ట్ర గవర్నర్​ హిమంత్​ బిశ్మ శర్మ వెల్లిడించారు. ఈ మేరకు సోమవారం మరోసారి ఆయనకు డయాలసిస్​ నిర్వహిస్తామన్నారు.

Tarun Gogoi very critical; PM Modi, Rahul Gandhi speak to son
విషమంగానే తరుణ్ గొగొయి ఆరోగ్యం
author img

By

Published : Nov 23, 2020, 5:57 AM IST

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి(84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు సమాచారం. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్​ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే.. వెంటిలేషన్​పై ఉన్న ఆయనకు సోమవారం మరోసారి డయాలసిస్​ నిర్వహించనున్నట్టు చెప్పారు మంత్రి. అంతవరకూ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నట్టు వెల్లడించారు శర్మ.

తరుణ్​ గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత శనివారం(21వ తేదీ) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలు కీలకమని వైద్య వర్గాలు ప్రకటించాయి.

ప్రముఖుల ఆరా..

మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా.. కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఆరా తీశారని గొగొయి కుమారుడు గౌరవ్​ గొగొయి తెలిపారు. తన తండ్రి ఆరోగ్యంపై ఇతర ముఖ్యమంత్రులు, నాయకులు అడిగి తెలుసుకుంటున్నట్టు చెప్పారు​. ఆయన ఆరోగ్యం మెరుగవ్వాలని కాంక్షిస్తూ.. పలుచోట్ల ప్రజలు చేస్తున్న ప్రార్థనలు ఫలించాలని భావోద్వేగంతో అన్నారు గౌరవ్​.

ఇవీ చదవండి:

విషమంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం

కాస్త మెరుగుపడ్డ మాజీ సీఎం ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.