తల్లి, పిల్ల ఏనుగులు మరణించేందుకు కారణమైన రైలు ఇంజిన్ను అసోం అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసు నమోదు చేసి, ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
పఠార్ఖులా, లంసాఖంగ్ రైల్వే స్టేషన్ల మధ్య సెప్టెంబర్ 27న రైలు ప్రమాదం జరిగింది. ఇందులో తల్లి, పిల్ల ఏనుగులు మరణించాయి. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం సంబంధిత రైలు ఇంజిన్ను సీజ్ చేశాం. కానీ ప్రజలకు అవసరమైన సేవలను దృష్టిలో ఉంచుకొని తిరిగి రైల్వే అధికారులకు అప్పగించాం. ఇందుకు పరిహారంగా న్యూ గువహటి సీనియర్ అధికారి రూ.12 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.
-అటవీ శాఖ అధికారులు
ఏనుగులు మరణించిన ఘటనలో ఇద్దరు లోకో పైలెట్లను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.
అసోంలో ఇలా రైలు పట్టాలపై ఏనుగులు చనిపోవడం కొత్తేమీ కాదు. వీటిని అరికట్టేందుకు అక్కడి అటవీ, రైల్వేశాఖల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.