ETV Bharat / bharat

ఒక్కరోజులో మూడు ఆసియా సింహాలు మృతి - అమ్రేలిలో సింహాల మరణం

గుజరాత్​ అమ్రేలిలో ఆసియా సింహాలు చనిపోతున్నాయి. 24 గంటల్లో 3 సింహాలు మృతి చెందాయి. వీటి మరణం అటవీశాఖ అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. సింహాల మృతి వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Asiatic lions die in Amreli, 3 lions die in 24 hours
ఒక్కరోజులో మూడు ఆసియా సింహాలు మృతి
author img

By

Published : May 28, 2020, 5:24 PM IST

గుజరాత్​ అమ్రేలి జిల్లాలో సింహాలు అనుమానాస్పదంగా మరణిస్తున్నాయి. గత 24 గంటల్లో మూడు సింహాలు చనిపోయాయి. మృగరాజుల మరణం అటవీ శాఖ అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది.

Asiatic lions die in Amreli, 3 lions die in 24 hours
ఒక్కరోజులో మూడు ఆసియా సింహాలు మృతి

24 గంటలు.. మూడు సింహాలు..

ఖంభ-పిపాల్వా పరిధిలోని మురికి ప్రాంతంలో ఓ సింహం పిల్ల కళేబరం అధికారులకు లభించింది. మరో సింహం పిల్ల కళేబరాన్ని సావర్కుండ్ల మిటియాలా అభయారణ్యంలో గుర్తించారు. మరోవైపు, రాజులాలోని కోవయ గ్రామం నుంచి రక్షించిన సింహం బాబర్‌కోట్ జంతు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ మూడు సింహాలు చనిపోవడానికి కారణం ఇంతవరకు తెలియలేదు. దీనిపై అటవీ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: మసీదులో ప్రార్థనకు వెళ్లి శవమై ఇంటికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.