బ్రిటన్కు చెందిన 'టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్'(టీహెచ్ఈ) 'ది ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2020' జాబితాను విడుదల చేసింది. మొదటి 100 విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్కు చెందిన 8 విద్యాసంస్థలు చోటు సంపాదించాయి.
ఈ 8 విద్యాసంస్థల్లో ఆరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లే ఉన్నాయి. ఐఐటీలు కాకుండా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ముంబయిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) చోటు దక్కించుకున్నాయి.
సంస్థ | ర్యాంక్ |
ఐఐఎస్సీ- బెంగళూరు | 36 |
ఐఐటీ రూప్నగర్ | 47 |
ఐఐటీ - ఇండోర్ | 55 |
ఐఐటీ- ఖరగ్పుర్ | 59 |
ఐఐటీ- దిల్లీ | 67 |
ఐఐటీ- బాంబే | 69 |
ఐఐటీ- రూర్కీ | 83 |
ఐసీటీ- ముంబయి- | 92 |
ఈ ఏడాది ఖరగ్పుర్, దిల్లీ ఐఐటీలు చాలా మెరుగుపడ్డాయని టీహెచ్ఈ వివరించింది. గతేడాది టాప్ 100 జాబితాలో లేని ఐఐటీ రూప్నగర్.. ఈసారి ఏకంగా 47 స్థానానికి చేరింది. బోధన, పరిశోధన, పరిశ్రమ ప్రమాణాల స్థాయిల్లో ఐఐటీల్లో నాణ్యత పెరిగిందని తెలిపింది.
తొలి 5 స్థానాల్లో..
- సింఘువా విశ్వవిద్యాలయం- చైనా
- పెకింగ్ యూనివర్సిటీ- చైనా
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
- యూనివర్సిటీ హాంకాంగ్
- ది హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇదీ చూడండి: అయోధ్యలో రామ మందిరానికి బుధవారమే పునాది