బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి డిసెంబర్ 31 వరకు విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇది అమలవుతుందని తెలిపింది.
22వ తేదీ అర్ధరాత్రికి ముందు బ్రిటన్ నుంచి వచ్చేవారికి కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం.
ఇదీ చూడండి:- కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?