అరుణాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు మరణించటంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
"కొండచరియలు విరిగిపడి పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
పాపుమ్ పరే జిల్లాలోని టిగ్డోలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 నెలల శిశువుతో సహా.. నలుగురు దుర్మరణం చెందారు. పాసిఘాట్లోని సిబో కోరింగ్ నదిలో చిక్కుకున్న ఓ జంటను రక్షించారు సహాయక సిబ్బంది.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో శాంతి స్థాపనకు భారత్, చైనా అంగీకారం