ETV Bharat / bharat

ప్రధాని మోదీకి కొత్త విమానం మరింత ఆలస్యం!

ఈ వారంలో భారత్​కు అందాల్సిన బీ777 విమానం.. సాంకేతిక కారణాల వల్ల మరింత ఆలస్యంకానున్నట్టు ఎయిర్​ ఇండియా అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం అమెరికాకు చెందిన బోయింగ్​తో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది భారత్​.

Arrival of custom-made B777 plane for VVIP travel delayed due to technical reasons
ప్రధాని మోదీకి కొత్త విమానం మరింత ఆలస్యం!
author img

By

Published : Aug 26, 2020, 5:00 AM IST

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థతో రెండు బీ777 విమానాలు తయారు చేయిస్తోంది భారత్​. వీటిలో ఒకటి ఈ వారంలో భారత్​కు రావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల డెలివరీ ఆలస్యమవుతుందని ఎయిర్​ ఇండియా అధికారులు వెల్లడించారు.

బోయింగ్​ నుంచి విమానాన్ని తీసుకునేందుకు ఎయిర్​ ఇండియా అధికారులు ఈ నెల తొలినాళ్లల్లోనే అమెరికాకు వెళ్లారు. కానీ విమాన డెలివరీ ఆలస్యమైంది. మరో విమానం సెప్టెంబర్​లో భారత్​కు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనాతో...

వాస్తవానికి ఈ విమానాలను బోయింగ్ జులైలోనే డెలివరీ చేయాల్సి ఉంది. కొవిడ్​-19 సంక్షోభం కారణంగా సకాలంలో రాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ రెండు బీ777 విమానాలను భారత వాయుసేన పైలట్లు ఆపరేట్ చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యత మాత్రం ఎయిర్ ఇండియాదే.

747 నుంచి 777కు...

ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రస్తుతం బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది 'ఎయిర్ ఇండియా వన్​' గుర్తును కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా పైలట్లే వీటిని ఆపరేట్​ చేస్తున్నారు.

బోయింగ్​ తయారు చేస్తున్న బీ777 విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థ, సెల్ఫ్​ ప్రొటెక్షన్​ సూట్లను ఉపయోగించనున్నారు. రెండు రక్షణ వ్యవస్థలను 190 మిలియన్​ డాలర్లకు విక్రయించేందుకు అమెరికా ఫిబ్రవరిలో అంగీకరించింది.

ఇదీ చూడండి:- 'ఎల్​ఏసీ' వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత క్షిపణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.