ETV Bharat / bharat

'ఆనకట్ట కూల్చిన పీతలను అరెస్టు చేయండి'

మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వం తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర విమర్శలు గుప్పించారు. రత్నగిరిలోని తివారే ఆనకట్ట పీతల వల్ల కూలిందని నీటి సంరక్షణశాఖ మంత్రి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీతలు డ్యామ్ కూల్చితే... వాటినే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

'ఆనకట్ట కూల్చిన పీతలను అరెస్టు చేయండి'
author img

By

Published : Jul 5, 2019, 7:03 PM IST

'ఆనకట్ట కూల్చిన పీతలను అరెస్టు చేయండి'

మహారాష్ట్రలోని అధికార భాజపా ప్రభుత్వ తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. రత్నగిరిలోని ఆనకట్ట పీతల వల్లే కూలిపోయిందని నీటి సంరక్షణ మంత్రి ప్రకటించడాన్ని తప్పుపట్టింది. పీతలు తప్పు చేస్తే వాటినే అరెస్టు చేయాలంటూ వినూత్నంగా నిరసన చేపట్టింది.

ఎన్​సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర కొన్ని పీతలు తీసుకుని నౌపాడ పోలీసు స్టేషన్​కు చేరుకున్నారు. ఆనకట్ట కూలడానికి కారణమైన పీతలను అరెస్టు చేయాలంటూ నిరసన చేపట్టారు.

"భాజపా ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోంది. ఆనకట్ట కూలడానికి కారణమైన గుత్తేదారును రక్షించడానికి నీటి సంరక్షణశాఖ మంత్రి సావంత్ ప్రయత్నిస్తున్నారు. ఆనకట్ట కూలడానికి పీతలే కారణమని అంటున్నారు. అలా అయితే ఆ పీతలనే అరెస్టు చేయండి." - జితేంద్ర, ఎన్​సీపీ ప్రధాన కార్యదర్శి.

కొల్హాపూర్​ ఎన్​సీపీ యుజవన విభాగం అధ్యక్షుడు మెహబూబ్​ షేక్ ఈ ఘటనపై షాహుపురి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆనకట్ట కూల్చిన పీతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర రత్నగిరిలోని తివారే ఆనకట్ట భారీ వర్షాలకు కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 23 మంది కొట్టుకుపోయారు. వీరిలో 19 మంది మరణించగా... మిగిలిన వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే ఈ ఆనకట్ట కేవలం పీతల వల్లే కూలిపోయిందని ఈ రాష్ట్ర నీటి సంరక్షణశాఖ మంత్రి తానాజీ సావంత్ అన్నారు.

ఇదీ చూడండి: 'పీతల వల్లే తివారె ఆనకట్ట​కు గండి'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Clients in the following regions must contact the local rightsholders for an agreement to use the footage: USA - ESPN/Tennis Channel, Australia - Seven Network/Fox Sports, Europe - Please contact local rightsholder. Cleared by Fox Sports Asia for Fox Sports Asia territories to use. Scheduled news bulletins only. Max use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK. 5th July, 2019.
Shaui Zhang (Chn) def. Caroline Wozniacki (14, Den) 6-4, 6-2
1. 00:00 MATCH POINT: Zhang drop volley clinches the second set and the match
SOURCE: AELTC
DURATION: 00:26
STORYLINE:
Former world number one Caroline Wozniacki's miserable Wimbledon record continued on Friday when she was beaten 6-4, 6-2 in the third round by China's world number 50 Shuai Zhang.
The 14th-seeded Dane had never gone beyond the last 16 at Wimbledon and blew a 4-0 first set lead against Zhang.
Wozniacki was also upset by a number of line calls but Zhang goes on to meet either Ukraine's Dayana Yastremska or Viktorija Golubic of Switzerland in the next round.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.