ETV Bharat / bharat

30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్​ - ఇద్దరు వైకాపా ఎంపీలకు కరోనా

పార్లమెంటు​ సమావేశాల వేళ ఎంపీల్లో కరోనా కలకలం రేపింది. ఏకంగా 30 మంది పార్లమెంట్​ సభ్యులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 50 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా ఉన్నట్లు తేలింది.

Around 30 MPs test positive for COVID: Sources
30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Sep 14, 2020, 6:18 PM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 30 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీరితో పాటు మరో 50 మంది పార్లమెంటు సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డట్టు తేలింది.

వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్​ సభ్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ తరుణంలో వీరికి నిర్వహించిన పరీక్షల్లో 30 మంది సభ్యులకు, 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​ సోకినవారిలో ఎక్కువ మంది అధికార భాజపాకు చెందినవారు కాగా.. వైకాపా సభ్యులు ఇద్దరు, ఆర్​ఎల్పీ, శివసేన, డీఎంకే నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.

వైకాపా ఎంపీల్లో గొడ్డేటి మాధవి, రెడ్డప్ప.. భాజపాలో అనంత కుమార్​ హెగ్డే, మీనాక్షి లేఖి, పర్వేశ్​ సాహిబ్​ సింగ్​ ఉన్నారు. వీరిని క్వారంటైన్​లో ఉండాలని సూచించారు అధికారులు. నెగెటివ్​ వచ్చిన వారిని మాత్రమే పార్లమెంటులోకి అనుమతిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.