జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ దారులు వెతుకుతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, ఉగ్రవాదులను దేశంలోకి పంపటం వంటివి చేస్తోంది.
తాజాగా దక్షిణ భారత దేశంలో దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. సముద్ర మార్గంలో తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్లు ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు.
" దక్షిణ భారత దేశంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది. సర్ క్రీక్ సరిహద్దు వద్ద కొన్ని పడవలను గుర్తించాం. ఉగ్రదాడుల్ని అరికట్టేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకున్నాం."
- లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ, సదరన్ కమాండ్ జీఓసీ
ఇదీ చూడండి: '2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'