ETV Bharat / bharat

సైన్యంలో మూడేళ్లపాటు 'సామాన్యుడి' సేవలు! - indian army latest news

సాధారణ పౌరులను 'టూర్​ ఆఫ్ డ్యూటీ' కింద మూడేళ్ల పాటు ఆర్మీలో చేర్చుకునే యోచన చేస్తోంది భారత సైన్యం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

Army mulling proposal to give three-year 'Tour of Duty' to common citizens in Force
సైన్యంలో సామాన్యుడి సేవల ప్రతిపాదనపై పరిశీలన
author img

By

Published : May 13, 2020, 4:48 PM IST

మూడేళ్ల పాటు 'టూర్​ ఆఫ్​ డ్యూటీ' కింద సాధారణ పౌరులను ఆర్మీలో చేర్చుకునేందుకు భారత సైన్యం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు భారత సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. భారత్​లోని ఉత్తమ ప్రతిభను దేశ సేవకు వినియోగించుకునే విధంగా ఈ ప్రతిపాదన ఉండనున్నట్టు పేర్కొన్నారు.

ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి 'షార్ట్​ సర్వీస్​ కమిషన్'​ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. భారత సైన్యంలో కొన్ని సంవత్సరాలుగా అధికారుల కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించి యువతను ఆకర్షించేందుకు ఆర్మీ అడుగులేస్తోంది.

'షార్ట్ సర్వీస్​ కమిషన్'​ పద్దతిని గతంలో ఐదేళ్ల కాల పరిమితితో ప్రవేశపెట్టింది సైన్యం. ప్రస్తుతం ఇందుకు మరింత బలం చేకూర్చేలా 10 సంవత్సరాలకు పొడిగించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.