జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఫలితంగా భారత జవాన్ ఒకరు మృతి చెందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.
భారత సైన్యం వెంటనే స్పందించి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేసిందని, పాక్ సైనికులను మట్టుపెట్టిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
వీర మరణం పొందిన జవాన్ నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ (36)... బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నాయక్ ఎంతో ధైర్యవంతుడని, నిజాయతీపరుడని, దేశానికి ఆయన సేవలు మరువలేనివని అధికారులు అన్నారు.
ఇదీ చూడండి:హైఅలర్ట్: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్ఐ ముఠా!