ETV Bharat / bharat

చైనా, పాక్​ను ఒకేసారి ఎదుర్కోవడం ఎలా? - భారత్​ చైనా న్యూస్

భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం ఇప్పటంతలో పరిష్కారమయ్యే సూచనలు కన్పించడం లేదు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు దీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధమవుతోంది భారత సైన్యం. ఈ విషయంపై చర్చించేందుకు ఆర్మీ టాప్​ కమాండర్లు నాలుగు రోజుల పాటు భేటీ కానున్నారు. దిల్లీలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సరిహద్దులో సైనిక సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు.

Army bosses meet from Oct 26 to tackle 'iron brothers' joint threat
సరిహద్దులో చైనా-పాకిస్థాన్​లు ఒకేసారి ఎదుర్కోవడం ఎలా?
author img

By

Published : Oct 23, 2020, 4:55 PM IST

సరిహద్దులో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. చైనా-పాకిస్థాన్​ కలిసి భారత్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయనే అంచనాలు త్వరలోనే నిజరూపం దాల్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చైనాతో తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కన్పించడం లేదు. పాకిస్థాన్​తో కశ్మీర్​ సరిహద్దులో తరచూ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రెండు దేశాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు భారత సైన్యం టాప్​ కమాండర్లు. అక్టోబర్​ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు దిల్లీలో సమావేశం కానున్నారు.

సన్నద్ధతపై సమీక్ష

దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న చైనా-పాకిస్థాన్​ తమను తాము 'ఉక్కు సోదరులుగా' అభివర్ణించుకుంటాయి. భారత్​ను దెబ్బతీసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవాలి చూస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అందుకే యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

'ఈ ఏడాది మేలో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం అత్యవసర కొనుగోళ్లు జరిపేందుకు భారత సైన్యానికి కేంద్రం అధికారం కల్పించింది . అనంతరం విదేశాల నుంచి గణనీయంగా సైనిక సామగ్రిని సైన్యం కొనుగోలు చేసింది. వీటిపై సమీక్ష జరిపి అవసరమైన సైనిక సామగ్రి అందుబాటులో ఉందా? లేకపోతే ఇంకా కొనుగోళ్లు చేయాలా? అనే విషయాన్ని గుర్తిస్తారు. లోటు ఉన్నట్లు భావిస్తే అత్యవసరంగా మరిన్ని సైనిక వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసేందుకు త్వరితగతిన చర్యలు చేపడతారు' అని సైనిక వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది ఏప్రిల్​-మే మధ్యకాలం నుంచి భారత్​-చైనా సైనికుల మధ్య వరుస ఘర్షణలు జరిగాయి. తూర్పు లద్ధాఖ్ నుంచి ఉత్తర సిక్కిం సరిహద్దు వరకు ఇరు దేశాల బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15 గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తూర్పు లద్ధాఖ్​ వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు లక్షకు పైగా బలగాలను మోహరించాయి.

పాకిస్థాన్​తో కాల్పుల ఘటనలు..

నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. 1996-2002 మధ్యకాలంలో ఇరు దేశాల బలగాల మధ్య క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాక 2003లో సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తరచూ జరిగే చొరబాట్లు, తుపాకీ కాల్పుల ఘటనలపై నిషేధం విధించాయి. 2004లో నియంత్రణ రేఖ వెంబడి కంచెను కూడా ఏర్పాటు చేశాయి.

అయితే 2016 సెప్టెంబరు 18న పాకిస్థాన్​ ఉగ్రవాదులు కశ్మీర్​ ఉరిలో భారత సైనిక శిబిరంపై దాడి చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉగ్రశిబిరాలపై దాడి చేసింది భారత​ సైన్యం. ఉగ్రవాదులు, పాక్​ సైనికులను మట్టుబెట్టింది. అప్పటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది పాక్. ఎంతో మంది జవాన్లు, పౌరుల ప్రాణాలను బలిగొంటోంది.

ఏటా మార్చి-ఏప్రిల్​, అక్టోబర్​లలో జరిగే భారత్​ సైన్యం టాప్​ కమాండర్ల సమావేశాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. సరిహద్దులో పరిస్థితులపై సమీక్షపై నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటారు. ఈ ఏడాది జూన్​ 23న తొలి సామావేశం జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.