అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు ఓ శుభవార్త చెప్పింది. భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను రేపు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘మార్చి 8న భారత ఆర్కియాలాజికల్ విభాగం పరిధిలో ఉండే ప్రాచీన కట్టడాల సందర్శనకు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రేపు ఒక్కరోజు స్త్రీలు వాటిని ఉచితంగా సందర్శించవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘
అంతర్జాతీయ మహిళా దినోత్సం జరుపుకోవడానికి ముందే మన దేశంలో స్త్రీలను పూజించే ఆచారం ఉంది. స్త్రీలను దేవతలతో పూజించడం మన సంప్రదాయం. ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప ముందడుగు.
--- ప్రహ్లాద్ పటేల్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి.
ప్రాచీన కట్టడాల వద్ద బేబీ ఫీడింగ్ గదుల ఏర్పాటు చేస్తామని మంత్రి ఇటీవలే ప్రకటించారు.
ఇదీ చూడండి:- అక్కడి పోలీస్ స్టేషన్లు, రైల్వేలో మహిళలకే పూర్తి బాధ్యతలు