లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్వహించారు. మహాత్మగాంధీ 150 జయంతికి సన్నాహకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి, ఎంపీ హేమామాలిని సహా పార్లమెంట్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహాత్ముడి జయంతి సందర్భంగా దేశంలోని ప్రతి పట్టణం, గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చడమే లక్ష్యమని ఉద్ఘాటించారు స్పీకర్ ఓం బిర్లా.
"ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంట్ 130 కోట్ల పైచిలుకు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం ఈ స్వచ్ఛతా అభియాన్ పార్లమెంట్, దేశంలోని ప్రతి పట్టణం, గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని ప్రతి గ్రామం, పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చడమే మా లక్ష్యం. ప్రజలతో మమేకమై స్వచ్ఛ్ భారత్ అభియాన్ను ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళ్లడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఈ కార్యక్రమం ద్వారా దేశాన్ని సుందరీకరించాలి. ప్రస్తుతం పార్లమెంట్ నుంచి ప్రారంభించాం. దీన్ని ప్రజాప్రతినిధులు పట్టణాలు, గ్రామాల్లో అమలు చేయాలి."
-ఓం బిర్లా, లోక్సభ స్పీకర్
ఇదీ చూడండి: అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!