ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒడిశాలో ప్రమాదక రీతిలో ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు నిత్యం కష్టపడుతున్న ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు.. పడవలు అందించేందుకు ముందుకొచ్చారు.
నిత్యం అవస్థలే..
మల్కాన్గిరి జిల్లా రాలేగడ గ్రామ పచాయతీకి చెందిన ఇద్దరు మహిళలు.. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అయితే అక్కడ రోడ్డు వసతులు లేవు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా కాలువ ప్రమాదక రీతిలో ప్రవహిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ క్యాన్లు, ఇతర వస్తువులను నడుముకు కట్టుకుని కాలువ దాటి విధులను నిర్వర్తిస్తున్నారు ఈ మహిళలు.
ఇటీవలే ఈ పూర్తి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు... 'మహీంద్రా మెరైన్' సంస్థ రూపొందించిన పడవలు ఉపయోగపడతాయా? అని అడిగారు ఆనంద్ మహీంద్రా.

ఇదీ చూడండి:- అమ్మకు అనంతమైన ప్రేమ పంచినందుకు కారు గిఫ్ట్