ETV Bharat / bharat

60 ఏళ్ల వయసులో 80కి.మీ రిక్షా తొక్కి ఆసుపత్రికి! - 60 YERAS RICKSHAWALA STORY

ఆసుపత్రేమో దూరం... భార్యకు ఆరోగ్యం అసలే బాలేదు... తీసుకుని పోవాలి అంటే సరిపడా డబ్బులు లేవు.... కానీ తీసుకువెళ్లాలి అనే సంకల్పం మాత్రం చాలా గట్టిగా ఉంది. 60 ఏళ్ల వయసును కూడా లెక్కచేయక 80 కి.మీ రిక్షా తొక్కుకుంటూ సతీమణిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు ఒడిశా కటక్​కు చెందిన కబీర్​బోయి అనే రిక్షావాలా..!

AN OLD MAN TAKEN HIS WIFE TO HOSPITAL ABOUT 80 KM  AWAY BY RICKSHAW
భార్యకు బాలేదు... ఆసుపత్రేమో దూరం..రిక్షానే అంబులెన్స్​.!
author img

By

Published : Oct 11, 2020, 11:35 AM IST

Updated : Oct 11, 2020, 12:09 PM IST

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ట్రాలీ రిక్షాపై కూర్చోబెట్టుకుని, సుమారు 80 కి.మీ దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారాయన. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో చోటు చేసుకుంది. సాక్షిగోపాల్​ ప్రాంతానికి చెందిన కబీర్​బోయి రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఇటీవల ఆయన భార్య సుకాంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను పరీక్షించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు కటక్​ తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో అంబులెన్స్​ సదుపాయం లేదు. ప్రైవేటు అంబులెన్స్​ వారిని సంప్రదిస్తే రూ.5వేలు ఆడిగారు. అందుకు స్తోమత లేక భార్యను తన రిక్షాపై తీసుకెళ్లాలని కబీర్​బోయి అనుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలో బయలుదేరి శనివారానికి కటక్​ చేరుకున్నారు.

ఓఎంపీ చౌక్​ దగ్గర ఆగి ఆసుపత్రి గురుంచి వాకబు చేస్తున్న కబీర్​ను స్థానిక మీడియా ప్రతినిధులు గమనించి ఆరా తీయగా విషయం బయటపడింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆ దంపతులిద్దరినీ ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుకాంతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: మోదీ టూ ట్రంప్​.. అందరూ మెచ్చే 'కాంగ్​డా టీ'

Last Updated : Oct 11, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.