జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరో దుస్సాహసానికి ఒడిగట్టారు. సైనిక వాహన శ్రేణిపై ఐఈడీ బాంబుదాడికి కుట్ర చేశారు. పుల్వామా జిల్లాలోని అరిహల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి 27 కిలోమీటర్ల సమీపంలోనే సైనికుల వాహన శ్రేణి ఉంది. ఈ పేలుడులో 8 మంది జవాన్లకు గాయాలయ్యాయి.
ప్రస్తుతం పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని దాడిపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.