ప్రతి ఏడాది ఈస్టర్ పండుగ రోజు చర్చిలన్నీ కళకళలాడుతుండేవి. అయితే కరోనా కారణంగా ఈస్టర్ వేళ దేశంలోని చర్చిలన్నీ బోసిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమై కుటంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు.
ప్రముఖ చర్చిల్లో మతగురువులు టీవీ ఛానెల్స్, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్‌ల ద్వారా ప్రార్థనలను ప్రసారం చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడు..
తమిళనాడు కోయంబత్తూరు ఆల్ సోల్స్ చర్చిలో రెవ్ చార్లెస్ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. అయితే ఈసారి ఈస్టర్ వేడుకలు చర్చిలో భక్తులెవరు లేకుండానే జరిగాయి.
![An Easter of Facebook live prayers sans church visits during lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6761192_k.jpg)
దిల్లీ
దిల్లీలోని గోల్డాక్ ఖానా దగ్గరలో ఉండే సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలోనూ ఇదే పరిస్థతి కనిపించింది. ప్రతి ఏడాది ఈ రోజున సందడి సందడిగా ఉండే ఈ చర్చిని లాక్డౌన్ కారణంగా పూర్తిగా మూసివేశారు.
![An Easter of Facebook live prayers sans church visits during lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6761192_m.jpg)
కేరళ, లఖ్‌నవూ, ముంబయి, గోవా సహా ఇతర రాష్ట్రాల్లోని చర్చిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
![An Easter of Facebook live prayers sans church visits during lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6761192_t.jpg)
![An Easter of Facebook live prayers sans church visits during lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6761192_l.jpg)
ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!