ETV Bharat / bharat

కొవిడ్​ నియంత్రణపై అమిత్​షా కీలక సమావేశం - amit shah meeting

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి  అమిత్ షా.. అధికారులతో సమావేశం అయ్యారు. వ్యాప్తిని నియంత్రించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

amit shah met with health officials on corona spread
దిల్లీలో కొవిడ్​ నియంత్రణపై అమిత్​షా కీలక సమావేశం
author img

By

Published : Nov 18, 2020, 3:07 PM IST

దిల్లీలో పెరుగుతున్న కొవిడ్​ కేసులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగుల చికిత్స ఏర్పాట్ల గురించి తెలుసుకోవాలని బృందాలను ఆదేశించారు. శుకూర్ బస్తీలో రైల్వేశాఖ అందించిన 800 పడకల రైల్వే కోచ్‌ను ఉపయోగించుకోవాలన్నారు.

45 పారామిలిటరీ వైద్యులు, 160 పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోగుల చికిత్సకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నవంబర్​ 25లోగా దిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాారు. నెల చివరినాటికి రోజుకు 60 వేల ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ సహకారంతో మరో 10 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి: వరవరరావును ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.