ETV Bharat / bharat

'రాజకీయ హింసకు నెలవైన ఏకైక రాష్ట్రం బంగాల్' - WB Jan Samvad Rally

బంగాల్​లో ఆయుష్మాన్​ భారత్​ పథకం అమలు కాకుండా అడ్డుకోవడంపై మమతా బెనర్జీ సర్కార్​పై నిప్పులు చెరిగారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దేశమంతా ఈ పథకం ఫలాలను పొందుతుంటే.. బంగాల్​లో మాత్రం హింసా రాజకీయాలు చెలరేగుతున్నాయని మమత సర్కార్​పై ధ్వజమెత్తారు షా.

Amit Shah fires on bengal govt over ayushman bharat scheme
మమత సర్కార్​పై అమిత్​ షా తీవ్రస్థాయిలో ధ్వజం
author img

By

Published : Jun 9, 2020, 12:30 PM IST

Updated : Jun 9, 2020, 12:35 PM IST

బంగాల్​లోని తృణమూల్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దేశవ్యాప్తంగా ఒక్క బంగాల్​ రాష్ట్రంలోనే హింసా రాజకీయాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు.

'జన్​-సంవాద్'​ ర్యాలీ పేరిట వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా బంగాల్ భాజపా కార్యకర్తల్ని ఉద్దేశించి దిల్లీ నుంచి ప్రసంగించారు అమిత్ షా. సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు సాధించినప్పటికీ తనకు మాత్రం బంగాల్​లో గెలుపొందిన 18 సీట్లే అత్యంత ప్రాముఖ్యమైనవని వ్యాఖ్యానించారు. లక్షిత, వాయు దాడుల ద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ సర్కార్​ గట్టి సందేశాన్నిచ్చిందన్నారు షా.

బంగాల్​లో ఆయుష్మాన్ భారత్​ పథకాన్ని అడ్డుకోవడంపైనా షా నిప్పులు చెరిగారు. దేశమంతా ఈ పథకం ఫలాలను పొందుతోందని, ఆఖరికి దిల్లీ ముఖ్యమంత్రి కూడా దీన్ని స్వాగతించారని.. మీరు మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని బంగాల్​ సర్కార్​ను సూటిగా ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి.

" నాణ్యమైన ఉచిత వైద్య సదుపాయాన్ని పొందే హక్కు బంగాల్​లోని పేద ప్రజలకు లేదా? పేదల హక్కులపై రాజకీయాలు చేయడాన్ని మమత సర్కార్​ మానుకోవాలి. మీరు కావాలంటే ఎన్నో అంశాలపై రాజకీయాలు చేయొచ్చు. పేదవారి ఆరోగ్యంపైనే ఎందుకు చేస్తున్నారు? బంగాల్​లో భాజపా అధికారంలోకి వస్తే.. నిమిషాల్లోనే ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని అమలు చేస్తాం.

బంగాల్​లో 2014 నుంచి రాజకీయ ఘర్షణలతో 100 మందికిపైగా భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అలాంటివారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. దేశమంతా ప్రజాస్వామ్య మూలాలు బలంగా పాతుకుపోతుంటే.. బంగాల్​లో మాత్రమే రాజకీయ హింస కొనసాగుతోంది."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

Last Updated : Jun 9, 2020, 12:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.