ETV Bharat / bharat

బంగాల్​కు అమిత్​ షా- చేరికలే లక్ష్యమా? - పశ్చిమ్​ బంగా

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి బంగాల్​కు వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో అంసతృప్త నేతల రాజీనామాల పర్వం కొనసాగుతున్న క్రమంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే హోంమంత్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎంసీ నేతల చేరికలే లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Amith shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా
author img

By

Published : Dec 18, 2020, 4:55 PM IST

అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్​ అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే.. పలువురు కీలక నేతలు పార్టీకి స్వస్తి పలికారు. వారంతా భాజపాలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి కోల్​కతా వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే షా వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. చేరికలే ప్రధాన లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్​ నేత సువేందు అధికారి.. అమిత్​ షా పర్యటన సందర్భంగానే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయనతో పాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు, అసంతృప్త టీఎంసీ నాయకులూ కమలదళంలో చేరతారని సమాచారం.

షా పర్యటన సాగనుందిలా..

  • శుక్రవారం రాత్రి కోల్​కతాకు చేరుకుని న్యూటౌన్​లోని హోటల్​లో బస చేస్తారు.
  • శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అధికారులతో సమావేశం అవుతారు షా. ఆ తర్వాత ఉత్తర కోల్​కతాలోని స్వామి వివేకానంద నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తారు.
  • అనంతరం మిద్నాపోర్​కు వెళ్లి ఖుదిరామ్​ బోస్​కు నివాళులర్పిస్తారు. రెండు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి మధ్యాహ్న భోజనం​ చేస్తారు. తర్వాత మిద్నాపోర్​ కళాశాల మైదానంలో బహిరంగ సభకు హాజరవుతారు. ఈ ర్యాలీలోనే పలువురు టీఎంసీ నేతలు పార్టీలో చేరే అవకాశం ఉంది.
  • బహిరంగ సభ నుంచి కోల్​కతాకు చేరుకుని రాష్ట్ర నాయకులతో పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారు.
  • ఆదివారం శాంతి నికేతన్​లోని విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం బౌల్​ సింగర్​ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారు. బోల్​పుర్​ రోడ్ ​షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు.

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి నెల హోంమంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​లో పర్యటిస్తారని ఇప్పటికే తెలిపారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​.

'మిషన్​ 200'పై ఫోకస్​..

బంగాల్​ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 'మిషన్​ 200' చేపట్టింది భాజపా. ఇందుకోసం ఐదుగురు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వారంతా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించి.. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదిక అందించనున్నారు. ఇందులో.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్​ ముండా, పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్​ సింగ్​ పటేల్​ వంటి కీలక నేతలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చూడండి: సువేందు రాజీనామా తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.