కశ్మీరీ యువత.. ఆయుధాలు వీడి కలం పట్టాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లుపడ్డాయి. 2019తో పోల్చితే 2020లో.. ఆయుధాలు పట్టిన యువకుల సంఖ్య 21శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 144మంది ఉగ్రవాదంలోకి చేరారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినా.. ముఖ్యంగా కరోనా సంక్షోభం కుదిపేసినా.. యువత ఆయుధాలవైపే మొగ్గు చూపించడం ఆందోళన కలిగిస్తోంది.
భద్రతా దళాల నుంచి ఈటీవీ భారత్ పొందిన గణాంకాల ప్రకారం.. 2019లో 119మంది యువకులు ఉగ్రవాదులుగా మారారు. ఈ ఏడాది.. నవంబర్ నాటికి ఈ సంఖ్య 144కు పెరిగింది. అంటే నెలకు సగటున 12మంది తుపాకులు పట్టుకుంటున్నారు.
ఏడాది | ఉగ్రవాదంలో చేరిన యువకులు |
2015 | 66 |
2016 | 88 |
2017 | 128 |
2018 | 191 |
2019 | 119 |
2020(నవంబర్) | 144 |
కారణాలేంటి?
ముష్కరులుగా మారుతున్న యువకుల సంఖ్య పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది.. లోయలో ప్రభుత్వం లేకపోవడమేనని తెలుస్తోంది. సాధారణంగా.. ప్రజలు తమ కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందాలనుకుంటారు. కానీ కశ్మీర్లో ప్రభుత్వం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం.
ఇదీ చూడండి:- ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం
ఉగ్రవాదుల నియామకాలకు కేంద్రంగా దక్షిణ కశ్మీర్ మారింది. ముఖ్యంగా పుల్వామాలో 35మంది, షోపియాన్‌లో 29, కుల్గాంలో 24మంది ఆయుధాలు పట్టారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా దొరికినంత మందిని దొరికినట్టు తమ బుట్టలో వేసుకున్నాయి.
చేరారు.. కానీ..
అయితే.. ఇలా చేరేవారికి సాంకేతికతపై పట్టు ఉన్నా.. ఉగ్రకార్యకలాపాలపై సన్నద్ధత ఉండటం లేదు. అదే సమయంలో.. ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర సంస్థలకు అందే నిధులపై కఠిన నిఘా వంటి చర్యలను అధికారులు ముమ్మరం చేయడం వల్ల.. వీరికి ఆయుధాలు కూడా సరిగ్గా అందటం లేదు. ఫలితంగా ఒకప్పటిలా కాకుండా.. క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు వీరికి శిక్షణ సరిగ్గా లభించడం లేదు. ఫలితంగా కొత్త నియామకాల్లో చాలా మంది నిరూపయోగంగా మారుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 30 వరకు 211మంది మిలిటెంట్లను మట్టుబెట్టింది భారత సైన్యం. 2019లో ఈ సంఖ్యలో 153,2019లో 153, 2018, 2017లలో వరుసగా 215,213మంది ఉగ్రవాదులను హతమార్చింది .
--- సంజీవ్ బారువా, సీనియర్ పాత్రికేయులు.