మహారాష్ట్ర సోలాపుర్-పుణె రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.
అంబులెన్సులో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. మోహో గ్రామంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.