రఫేల్ ఒప్పందం విషయంలో కాంగ్రెస్, నేషనల్ హెరాల్డ్ పత్రికలపై వేసిన పరువు నష్టం దావాను రిలయన్స్ గ్రూపుల చైర్మన్ అనిల్ అంబానీ ఉపసంహరించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్.. రఫేల్‌పై ఆరోపణలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. రఫేల్ వ్యవహారం సుప్రీం పరిధిలో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు అనిల్ అంబానీ.
36 యుద్ధ విమానాల కొనుగోలులో రూ.30వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ సభ్యులు చాలా కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలపై అహ్మదాబాద్ కోర్టులో రూ.5వేల కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది రిలయన్స్ . ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సునీల్ జక్కర్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, ఉమెన్ చాందీ, అశోక్ చవాన్, అభిషేక్ సింఘ్వీలను ప్రతివాదులుగా పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక కథనంపై..
రఫేల్ కొనుగోలు ప్రకటనకు కేవలం 10 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను స్థాపించారన్న నేషనల్ హెరాల్డ్ కథనంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావా దాఖలు చేసింది రిలయన్స్. ఇలాంటి ఆరోపణలు సంస్థ పరువును దెబ్బ తీస్తాయని అంబానీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇకపై 'డాట్ అమెజాన్' ఇంటర్నెట్ డొమైన్