పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
రేపటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. సమావేశాల నిర్వహణపై... కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను నేతలకు వివరించనున్నారు.