ETV Bharat / bharat

మినీ బ్రెజిల్‌గా పేరుగాంచిన 'అలఖ్‌పురా' - ఫుట్​బాల్​ క్రీడాకారులు

పిల్లలు, యువత, పెద్దలు అని తేడా లేకుండా ఓ ఊర్లోని వారంతా ఫుట్‌బాల్‌ అంటే ఇష్టపడతారని ఎప్పుడైనా విన్నారా? ఆ ఊర్లో సల్వార్‌, గాగ్రాలు ధరించి ఆడపిల్లలు జోష్‌తో ఫుట్‌బాల్ ఆడతారని తెలుసా‌ ? అందుకే ఆ ఊరికి 'మినీ బ్రెజిల్' అని పేరొచ్చింది. ఆ ఊరే హరియాణ భివాణీ జిల్లాలోని అలఖ్​పురా.

Full of Football players in alakhpur
మినీ బ్రెజిల్‌గా పేరుగాంచిన 'అలఖ్‌పూర్'
author img

By

Published : Nov 30, 2020, 7:58 AM IST

మినీ బ్రెజిల్‌గా పేరుగాంచిన 'అలఖ్‌పురా'

హరియాణలోని ఓ గ్రామం మినీ బ్రెజిల్‌గా పేరుగాంచింది. ఈ ఊర్లోని ప్రతి ఇంట్లో ఓ ఫుట్‌బాల్ ఛాంపియన్ ఉంటారు. ఫుట్‌బాల్‌పై అభిరుచి, సాధించాలన్న కసితో కఠోర సాధన చేసే ఆడపిల్లలు ఇక్కడ కనిపిస్తారు. ఆ ఊరే భివాణీ జిల్లాలోని అలఖ్‌పురా. ఈ ఊర్లోని అమ్మాయిలు అన్ని సమస్యలు ఎదుర్కుని, విజయతీరాలు చేరుతున్నారు. పిల్లలు, యువత, పెద్దలు, ముసలివాళ్లు అని తేడా లేకుండా ఆ ఊర్లోని వారంతా ఫుట్‌బాల్‌ అంటే ఇష్టపడతారని ఎప్పుడైనా విన్నారా? ఆ ఊర్లో సల్వార్‌, గాగ్రాలు ధరించి జోష్‌తో ఫుట్‌బాల్‌ ఆడే ఆడపిల్లలుంటారని తెలుసా? అందుకే ఆ ఊరికి మినీ బ్రెజిల్ అని పేరొచ్చింది. ఈ గ్రామంలో కిక్‌తో ప్రారంభమయే రోజు...కిక్‌తోనే ముగుస్తుంది. వీరి ప్రతిభను చూసి, ప్రభుత్వమే ఫుట్‌బాల్‌ కోచ్‌లను ప్రత్యేకంగా నియమించింది.

"అమ్మాయిలే చాలా బాగా ఆడతారు. మా ఊర్లో గొప్ప జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులున్నారు."

- సంజయ్, అలఖ్‌పురా సర్పంచ్

2009లో బీజం

ఈ ఊర్లోని అమ్మాయిలందరికీ ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెరగడం వెనక ఓ పెద్ద కథే ఉంది. 2009లో ఇదంతా ప్రారంభమైంది. గ్రామానికి చెందిన 11 మంది అమ్మాయిలు ఓ జట్టుగా ఏర్పడి ఊర్లోని పాఠశాలలో ఫుట్‌బాల్ ఆడారు. వారిలోని ప్రతిభను చూసిన పీటీ గోవర్ధన్ శర్మ...ఫుట్‌బాల్ సాధన చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలా కఠోర సాధనతో జాతీయస్థాయిలో పతకం సాధించారు ఆ అమ్మాయిలు. ఆ విజయం అలఖ్‌పురా‌లోని పిల్లలపై పెద్ద ప్రభావమే చూపింది. ఫుట్‌బాల్‌పై అందరికీ విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఊర్లోని 200 మంది పిల్లలు ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది అమ్మాయిలే.

" చుట్టూ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు కూడా గ్రౌండ్‌లో కనిపిస్తారు. 22 నుంచి 23 ఏళ్ల వయసున్న అమ్మాయిలందరూ గ్రౌండ్‌కు వస్తారు. మొత్తంగా 200 నుంచి 250 మంది సాధన చేస్తారు. అందుకే ఈ ఊరికి మినీ బ్రెజిల్ అని పేరొచ్చింది."

- సోనికా బిజార్నియా, శిక్షకురాలు

అంతర్జాతీయ క్రీడాకారులు..

సంజూ యాదవ్, రీతూ, సమిరిక్ జాఖర్, దీపికా సమౌతా, మునేష్ రావ్, మంజు కాస్వాన్, పూనం శర్మ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ చిన్న గ్రామంలోనే శిక్షణ పొందారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఊరికి చెందిన 12 మంది అమ్మాయిలు అండర్-17, అండర్-21 జట్టుల్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం 8 మంది....అండర్-17 ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కి ఎంపికయ్యారు. 2015-16, 2016-17 ఏడాదిలో సబ్‌రోటో కప్‌ను కైవసం చేసుకున్నారు.

" అమ్మాయిలైతే ఏంటి? ఆటలు ఆడతారు, జీవితంలో ముందుకెళ్తారు. అప్పుడే వాళ్లకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తేడా లేదు. అన్నిరంగాల్లోనూ ఆడపిల్లలు దూసుకెళ్తున్నారు. కుమార్తెలను ప్రోత్సహించని తండ్రులెవరూ మా ఊరిలో ఉండరు. "

- మన్‌దీప్, గార్డియన్

ఊరంతా కలిసి..

సోనికా బిజార్నియా ఆరేళ్లుగా ఈ గ్రామంలోనే శిక్షకురాలిగా పనిచేస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఒక్క అమ్మాయైనా ఫుట్‌బాల్ ఆడేందుకు అలఖ్‌పురాకు వస్తుందని చెప్తోంది. ఆటలు ఆడేందుకు కావల్సిన బూట్లు, దుస్తులు, ఇతర వస్తువులు కొనుక్కునేందుకు... గ్రామస్థులంతా కలిసి, కావాల్సిన డబ్బు సమకూరుస్తారు. పతకం సాధించి ఓ క్రీడాకారుడు తిరిగి వస్తే..ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటుంది.

" 14 ఏళ్ల అమ్మాయి, అండర్-14 పోటీల్లో పాల్గొని వచ్చింది. నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తోంది. జాతీయస్థాయి పోటీ గెలిచినందుకు ఆమెకు 50 వేల రూపాయలు వస్తున్నాయి. 14 ఏళ్లకే ఓ అమ్మాయి 50వేలు సంపాదించడం సాధ్యమేనా? కానీ ఈ అమ్మాయికి అది సాధ్యమే. మా ఊర్లో 50 వేల నుంచి 5 లక్షల రూపాయల ఉపకారవేతనం అందించే ప్రోగ్రాం ఉంది. సీనియర్ ఇండియా పోటీల్లో ఆడినవారికి, దక్షిణాసియా గేమ్స్‌లో పాల్గొన్నవారికి ఐదు లక్షల ఉపకారవేతనం అందుతోంది."

- సోనికా బిజర్నియా, కోచ్

ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ..

ఈ ఊరి అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడి, పతకాల పంట పండించడమే కాదు...ప్రభుత్వ ఉద్యోగాలూ సాధించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడల్ లావో, నౌకరీ పావో పథకం కింద, చాలా మంది క్రీడాకారులు ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. కరుణ, జ్యోతి తమ సీనియర్ల లాగే జాతీయ ఫుట్‌బాల్ జట్టులో చోటు కోసం కష్టపడుతున్నారు. గ్రామంలోని మైదానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠోరంగా సాధన చేస్తున్నారు. " సీనియర్ ఇండియా పోటీల్లో ఆడడం నా లక్ష్యం. భారత జట్టులో ఆడాలి. భారత్‌కు పతకం తీసుకురావడమే నా ధ్యేయం." అని ఫుట్‌బాల్ క్రీడాకారిణి సోనియా జఖర్ తెలిపారు.

" నేను జాతీయస్థాయి క్రీడాకారుడిని. ఇప్పటివరకూ 2018-19 యూనివర్సిటీ గేమ్స్‌లో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచాం. జాతీయస్థాయి పోటీల్లోనూ మా జట్టు ఎంపికై, స్వర్ణం సాధించేందుకు కృషిచేస్తున్నాం."

- పూనమ్ యాదవ్, జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు

ఈ ఊరి అమ్మాయిల ఫుట్‌బాల్ ఆటను చూస్తే, హరియాణ బాక్సింగ్‌, రెజ్లింగ్‌లోనే కాదు... ఫుట్‌బాల్‌లోనూ ముందంజలోనే ఉందని అనక మానరు. ప్రపంచస్థాయిలో ఇక్కడి క్రీడాకారులు సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. హరియాణ అమ్మాయిల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రోజు కాస్త ఆలస్యమైనా తప్పకుండా వస్తుందని ఆశిద్దాం.

ఇదీ చూడండి:వారి జీవితమంతా కన్నీటి వెతలే, కష్టాల కథలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.