ETV Bharat / bharat

'కరోనా క్లీనింగ్​ పేరిట కూలీలపై రసాయనాల దాడి'

ఉత్తర్​ప్రదేశ్ బరేలీలో స్వస్థలాలకు వెళ్తున్న వలసదారులపై ప్రభుత్వ సిబ్బంది రసాయనాలు చల్లడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఇలా చేయడం నిర్లక్ష్యపూరితమని మండిపడ్డారు ఎస్పీ అధినేత అఖిలేశ్​. పొరపాటు జరిగిందని అంగీకరించిన జిల్లా కలెక్టర్... బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు స్పష్టంచేశారు.

Akhilesh targets UP govt over spraying 'disinfectant' over migrants, Bareilly DM admits 'mistake'
'వలసదారులపై రసాయనాలు జల్లడమా?'
author img

By

Published : Mar 30, 2020, 5:06 PM IST

ఉత్తర్​ప్ర​దేశ్​లో శానిటైజింగ్ పేరుతో వలసదారులపై రసాయనాలు జల్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎస్​పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​. బరేలీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బరేలీలో కొంతమంది ప్రజలు రోడ్డుపై కూర్చున్నట్టు.. వారిపై కొన్ని రసాయనాలు జల్లుతున్నట్టు ఓ వార్తా పత్రిక కథనం ప్రచురిచింది. ఈ ఘటన తర్వాత.. అనేకమంది వలసదారులు వారి కళ్లు మండుతున్నాయని ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించి.. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు అఖిలేశ్​.

  • यात्रियों पर सेनिटाइज़ेशन के लिए किए गए केमिकल छिड़काव से उठे कुछ सवाल:

    - क्या इसके लिए विश्व स्वास्थ्य संगठन के निर्देश हैं?
    - केमिकल से हो रही जलन का क्या इलाज है?
    - भीगे लोगों के कपड़े बदलने की क्या व्यवस्था है?
    - साथ में भीगे खाने के सामान की क्या वैकल्पिक व्यवस्था है? pic.twitter.com/Wgqh8Ntkky

    — Akhilesh Yadav (@yadavakhilesh) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"శానిటైజింగ్​ పేరుతో వలసదారులపై అలా రసాయనాలు జల్లడం అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇచ్చిందా? ఈ రసాయనాల వల్ల ఏదైనా అయితే .. చికిత్స ఎలా అందిస్తారు? తడిసిన బట్టలను మార్చుకోవడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇలా రసాయనాలు జల్లడం వల్ల వారి వద్ద ఉన్న ఆహారం పాడైపోతుంది. మరి వేరే ప్రత్యామ్నాయాలు చేశారా?"

-- అఖిలేశ్​ యాదవ్​, ఎస్​పీ అధ్యక్షుడు.

వలసదారుల విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు జిల్లా కలెక్టర్​ నితీశ్​ కుమార్. ఇది కేవలం స్థానిక యంత్రాంగం అత్యుత్సాహం వల్లే జరిగిందని.. సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతున్నట్టు ట్వీట్​ చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- 'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.