కష్టాలను ఖాతరు చేయలేదు
ఐదేళ్ల క్రితం ఐశ్వర్య సాదాసీదా అమ్మాయే. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య నలిగి ఎన్నో కష్టాలు పడింది. ఇంటర్ ఫెయిల్ అయ్యింది. తండ్రి ఆగ్రహంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. అయినా జీవితాన్ని మాత్రం పక్కదారి పట్టించలేదు. బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఖర్చుల కోసం ఓ నగల తయారీ సంస్థలో మోడల్‌గా చేసిన ఐశ్వర్య.. వచ్చిన ఆదాయంలో కొద్దికొద్దిగా దాచుకుని తనకు నచ్చిన డ్యూక్ 200 బైక్ కొనుక్కుంది. అలా బైక్ రేసుల వైపు అడుగులు వేసి విజయాలను తన ఖాతాలోi వేసుకుంది.
గాయలెన్నైనా.. గమ్యం చేరింది
జూన్ 2017. మరో ఐదు రోజుల్లో నేషనల్ ఛాంపియన్‌షిప్. జిమ్‌కు వెళ్లి వస్తుండగా ఒక కారు ఐశ్వర్యను ఢీకొంది. ఆమె కాలర్‌బోన్ విరిగిపోయింది. వైద్యులు శస్త్ర చికిత్స చేసి 36 కుట్లు వేశారు. అయినా ఆమె పట్టు వీడలేదు.
2018లో ఐశ్వర్య అంతర్జాతీయ రైడింగ్ ఈవెంట్‌కు ఎంపికైన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. మరో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే రైడింగ్ పూర్తవుతుందని అనుకుంటోన్న సమయంలో కింద పడిపోయింది. ఆమె పొట్టకు తీవ్ర గాయమైంది. క్లోమగ్రంథి విపరీతంగా దెబ్బతింది. అయినా తన లక్ష్యం మారలేదు.
మోటార్ స్పోర్ట్స్ విమెన్ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఐదునెలలు కఠోర సాధన చేసింది. దాదాపు ఐదునెలలపాటు నాలుగు దేశాల్లో జరిగిన ఈ ర్యాలీలో పాల్గొంది. 65 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు ఐశ్వర్య ఎఫ్ఐఎమ్ బజాస్ ప్రపంచ కప్ మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. జూనియర్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. గాయాలు తనను మరింత దృఢపరిచాయని చెప్పుకొచ్చింది ఈ రైడర్.
"బైక్ రైడింగ్ నా కల.. 18 ఏళ్ల వయసులో నేను బైక్ నడపడం ప్రారంభించాను కానీ 19 ఏళ్లకు నేను బైక్ రైడింగ్‌నే వృత్తిగా మలుచుకున్నాను. నా కుటుంబం, స్నేహితులు, టీం సభ్యులు, కోచ్ ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించారు. 2018లో బైక్ రైడింగ్ ప్రపంచకప్‌లో జరిగిన ప్రమాదంలో చాలా గాయపడ్డాను. 2 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నాను. ఆ ప్రమాదం జరిగిన గాయం నన్ను మరింత దృఢంగా తయారు చేసింది. నా ఒక్క అడుగు ఎంతో మందిని పెద్ద కలలు కనేలా ప్రోత్సహింస్తుంది. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. విజయసాధనకు అందరూ ముందడుగు వేయాలి."
-ఐశ్వర్య మధుసూధన్ పిస్సే
ఇదీ చూడండి: దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!