ETV Bharat / bharat

రైల్వే బాదుడు-స్టేషన్లలో వినియోగ ఛార్జీలు!

స్టేషన్లలో వినియోగ ఛార్జీల పేరిట ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది రైల్వేశాఖ. విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరించిన స్టేషన్లలో ఈ రుసుము వసూలు చేయనుంది.

RAILWAY USER CHARGES
రైల్వే బాదుడు!
author img

By

Published : Feb 12, 2020, 11:17 PM IST

Updated : Mar 1, 2020, 3:53 AM IST

ప్రయాణికులపై రైల్వేలు అదనపు భారాన్ని మోపనున్నాయి. కొత్తగా అభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో వినియోగ ఛార్జీలు వడ్డించనుంది. ఫలితంగా భవిష్యత్తులో రైల్వే ఛార్జీలు పెరగనున్నాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

విమానాశ్రయాల్లో వినియోగదారుల అభివృద్ధి రుసుము(యూడీఎఫ్​) పేరిట పన్నులో భాగంగా వినియోగ ఛార్జీలు విధిస్తారు. విమానాశ్రయాల స్థాయి, వివిధ అంశాలను బట్టి యూడీఎఫ్​ రేటును నిర్ధరిస్తారు.

ఇదే విధంగా కొత్తగా పునరుద్ధరించిన స్టేషన్లలో రద్దీని అనుసరించి రుసుమును నిర్ణయిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

రూ.50వేల కోట్లతో ఆధునికీకరణ

2020-21లో రైల్వే స్టేషన్​ రీడెవలప్​మెంట్ కార్పొరేషన్​ లిమిటెడ్​ ఆధ్వర్యంలో 50 స్టేషన్లను ఆధునికీకరించనున్నారు. ఇందుకు రూ.50వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశలో 400 స్టేషన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : Mar 1, 2020, 3:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.