సుదీర్ఘకాలం భారత వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన భారత ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఇవాళ పదవీ విరమణ చేశారు. ధనోవా స్థానంలో నూతన ఎయిర్ చీఫ్ మార్షల్‌గా రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా బాధ్యతలు స్వీకరించారు.
పదవీ విరమణకు ముందు బీఎస్ ధనోవా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వైమానిక దళం ఏర్పాటుచేసిన కవాతులో చివరి గౌరవ వందనం స్వీకరించారు.
ఇదీ చూడండి: ఐఐటీ మద్రాసులో ప్రధాని.. ప్రత్యేక ఎగ్జిబిషన్ సందర్శన