ETV Bharat / bharat

'కరోనాకు కొత్త చికిత్సా విధానం దిశగా ఎయిమ్స్​ ముందడుగు' - ఎయిమ్స్​ కరోనా పరిశోధనలు

కరోనా రోగులకు చికిత్స అందించే విధానాల్లో కొత్త పద్ధతులపై దృష్టి సారించింది భారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్​. ఈ మేరకు వైరస్​ బాధితుల్లో రేడియేషన్​ కిరణాలను ప్రవేశపెట్టి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. నిమిషాల వ్యవధిలో సాగే ఈ చికిత్సలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవన్న నిపుణులు.. త్వరలోనే మరింత లోతుగా పరిశోధనలు జరుపుతామని పేర్కొన్నారు.

AIIMS conducts pilot study to assess effect of radiation therapy on COVID-19 patients
కరోనాకు కొత్త చికిత్సా విధానం దిశగా ఎయిమ్స్​ ముందడుగు
author img

By

Published : Jun 17, 2020, 5:59 PM IST

కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు భారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్‌.. కొత్త చికిత్సా విధానంపై పరిశోధనలు ఆరంభించింది. ఇందుకోసం వైరస్​ సోకిన రోగుల శరీరంలోకి రేడియేషన్ కిరణాలను ప్రవేశపెట్టి పరీక్షించగా.. వారిలో న్యూమోనియా లక్షణాలు క్షీణించి, ఆరోగ్యం మెరుగుపడిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించే ఈ చికిత్సతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు వైద్యులు. 1940వ దశకం వరకు క్యాన్సర్ చికిత్సకు యాంటిబయోటిక్స్ అందుబాటులో లేని సమయంలో ఈ విధానాన్నే అనుసరించారని తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ చికిత్సా విధానం మంచి ప్రభావం చూపిందన్న వైద్యులు.. రానున్న రోజుల్లో మరి కొందరు కరోనా బాధితులపై అధ్యయనం చేస్తామన్నారు. సత్ఫలితాలు వస్తే, ఈ విధానంపై మరింత లోతుగా పరిశోధనలు జరుపుతామని వెల్లడించారు ఎయిమ్స్ వైద్యులు.

ఇదీ చదవండి: కరోనాపై రణం: 5 రాష్ట్రాల్లో 960 ఐసోలేషన్​ బోగీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.